ఆటగాళ్ళు మూవీ రివ్యూ

Release Date :24 Aug 2018

Run Time :141 ని

Genres :థ్రిల్లర్‌

Music :సాయి కార్తీక్‌

Director :పరుచూరి మురళి

Producer :వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర

Stars :నారా రోహిత్, జగపతి బాబు, దర్శన బానిక్, సుబ్బరాజు, బ్రహ్మానందం


యంగ్ హీరో నారా రోహిత్ మరో డిఫరెంట్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు ‘ఆటగాళ్ళు’తో వచ్చారు. సీనియర్ నటుడు జగపతి బాబుతో కలిసి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. లాంగ్‌ గ్యాప్‌ తరువాత పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఎంతో ఆసక్తి నెలకొంది. నారా రోహిత్ ఈ సినిమాతో కమర్షియల్ హిట్ సాధించే ప్రయత్నం చేశాడు. 

కథ :

మహాభారతాన్ని డైరెక్ట్‌ చేయాలని కలలు గనే సినీ దర్శకుడు సిద్ధార్థ్ (నారా రోహిత్‌) కనిపిస్తాడు. ఆ ప్రాజెక్టు పని మీద అంజలి(దర్శన్ బానిక్) ని కలిసి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మూడేళ్ల తర్వాత అంజలి హత్యకు గురవుతుంది. భార్యను చంపిన కేసులో సిద్ధార్థ్ ను రిమాండ్ కు పంపిస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరేంద్ర (జగపతిబాబు) సిద్ధార్థ్ ని కేసు నుంచి బయట పడేస్తాడు. ఇది ఎలా జరిగిందన్నదే సినిమా.. దీనిని  తెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

  • నారా రోహిత్, జగపతి బాబు నటన అదుర్స్
  • నేపథ్య సంగీతం అలరించేలావుంది.

మైనస్ పాయింట్స్ :

  • లవ్‌ సీన్స్‌ పేలవంగా ఉన్నాయి.
  • స్లో నేరేషన్ కాస్త బోర్ కొట్టిస్తుంది.

సాంకేతికవర్గాల పనితీరు :

  • సాయి కార్తీక్‌ సంగీతం పరవాలేదు. 
  • సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఎత్తుకు పైఎత్తులతో సాగే కథలో నారా రోహిత్, జగపతిబాబులు పోటీపడిమరీ నటించారు. చాలా కాలం తరువాత బ్రహ్మానందంకు కామెడీ స్కోప్‌ కలిగిన పాత్ర దక్కింది. సీరియస్‌గా సాసే సినిమాలను ఇష్టపడేవారిని ఈ సినిమా అలరిస్తుందంటున్నారు.