సినిమా వార్తలు

యంగ్ టైగర్ కలెక్షన్ కింగ్!


11 months ago యంగ్ టైగర్ కలెక్షన్ కింగ్!

ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' ఘన విజయం సాధించడంతో పాటు, మరే తెలుగు హీరోకూ సాధ్యంకాని ఓ రికార్డును ఎన్టీఆర్ కు సొంతం చేసుకుంది. ఓవర్‌ సీస్‌ లో భారీ కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమా, ఇప్పటికే సుమారు 1.7 మిలియన్‌ డాలర్లను (దాదాపు రూ. 12.50 కోట్లు) వసూలు చేసింది. ఈ స్థాయిలో ఓవర్ సీస్ వసూళ్లు సాధించిన హీరోల్లో పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు ఉన్నప్పటికీ, వీరెవరూ తమ వరుస నాలుగు చిత్రాల్లో ఇంత కలెక్షన్లు సాధించిన దాఖలాలు లేవు. ఇప్పడు ఈ రికార్డు యంగ్ టైగర్ కే సొంతమైంది. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్‌', 'జై లవకుశ' చిత్రాలు 1.5 మిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి 'అరవింద సమేత' కూడా చేరింది.