సినిమా వార్తలు

అపజయాలు రౌడీని మార్చలేవు: విజయ్ దేవరకొండ


1 year ago అపజయాలు రౌడీని మార్చలేవు: విజయ్ దేవరకొండ

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' చిత్రం తీవ్ర నిరాశపరిచిందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో విజయ్ దేవరకొండ తన స్పందనను తెలిపారు. ఈ సినిమాపై విమర్శులు ఎందుకు వచ్చాయో స్టడీ చేస్తానని, ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరిద్దుకుంటానని అన్నారు. విజయ్ దేవరకొండ 'నోటా' సినిమా ద్వారా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి విదితమే. విజయ్ నటించిన 'అర్జున్ రెడ్డి', 'గీతా గోవిందం' భారీ విజయం సాధించడంతో 'నోటా'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నా కోసం ‘నోటా' సినిమా చూడటానికి వెళ్లిన వారికి, ఈ సినిమా చూసి అసంతృప్తికి గురైన వారికి, సంతృప్తికి గురైన వారికి నేను ఒకటే చెబుతున్నాను. నేను ఇక్కడ సాకులు చెప్పాలనుకోవడం లేదు. దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకుంటున్నాను. ‘నోటా' సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా ద్వారా మేము చెప్పాలనుకున్న స్టోరీ చెప్పాము, అందుకు తగిన పెర్ఫార్మెన్స్ ఇచ్చాం అని విజయ్ తెలిపారు.

తమిళనాడు, నేషనల్ మీడియాతో పాటు నా సినిమాను ఇష్టపడిన వారి ప్రేమను స్వీకరిస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మెప్పించే చిత్రాలు మరిన్ని చేస్తాను అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ఎవరికైతే ‘నోటా' సినిమా నచ్చలేదో? ఎవరైతే విమర్శలు చేశారో వాటిన్నన్నింటినీ సీరియస్‌గా తీసుకుంటాను.‘నోటా'పై అసంతృప్తిగా ఉన్న వారిని మెప్పించడానికి మరింత కష్టపడతాను. అయితే నా యాటిట్యూడ్ అయితే మారదు. విజయాలు, అపజయాలు రౌడీని మార్చలేవు. దాన్ని ఆపితే మనం ముందుకు సాగలేం. రౌడీ అనేది కేవలం విజయం కోసం కాదు, రౌడీ అనేది పోరాడే తత్వం అని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు.