సినిమా వార్తలు

క్రిస్మస్‌కు ముందుగా ‘యాత్ర’


11 months ago క్రిస్మస్‌కు ముందుగా ‘యాత్ర’

ఒక వైపు ఎన్టీఆర్ బయోపిక్, మరో వైపున వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ శరవేగంగా నిర్మాణాలు జరుపుకుంటున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి  రాజకీయ జీవితాన్ని ఆయన కొనసాగించిన పాదయాత్ర మలుపు తిప్పిన విషయం విదితమే. ఆ పాదయాత్రను ఆధారంగా చేసుకునే 'యాత్ర' బయోపిక్ రూపొందిస్తున్నారు. వైఎస్ గా మమ్ముట్టి నటిస్తోన్న ఈ సినిమాకి మహి. వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుందని సమాచారం. ఇప్పుడు నిర్మాణానంతర పనులలో  ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో రాజశేఖర్ రెడ్డి పాత్రపోషించిన మమ్ముట్టి తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. జగపతిబాబు, సుహాసిని, రావు రమేష్, అనసూయ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. డిసెంబర్ 21వ తేదీన  అంటే క్రిస్మస్ కు ముందుగానే ఈ సినిమాను భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.