సినిమా వార్తలు

డిసెంబర్ 21న ‘యాత్ర ‘ విడుదల


8 months ago డిసెంబర్ 21న ‘యాత్ర ‘ విడుదల

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చరిత్ర ను యాత్ర పేరుతో బయోపిక్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వై ఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ తో ఈ విషయం స్పష్టమైంది. మొదటి సింగిల్ సాంగ్ తో యాత్ర స్టోరీ లోని హై ఇంటెన్సిటీ చూపించారు. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ బ‌యెపిక్ ని తెర‌కెక్కిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ హంగులతో యాత్ర చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. వై ఎస్ ఆర్ పార్టీ అధ్యక్షుడు, వై ఎస్ ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ డే కానుకగా యాత్ర చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ  మ‌డ‌మ‌తిప్ప‌ని నాయకుడి పాత్ర‌లో న‌టిస్తున్న మమ్మ‌ట్టి  ప్ర‌జానాయ‌కుడు వై ఎస్ ఆర్ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసిమరీ న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన యాత్ర మెద‌టి లుక్ కి, టీజ‌ర్ కి, ఫస్ట్ సింగిల్ కు రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల నుండి అనూహ్య‌మైన స్పంద‌న రావడంతో చాలా సంతోషంగా ఉంది. మా బ్యానర్ నుంచి భ‌లేమంచిరోజు, ఆనందోబ్ర‌హ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర హ్యాట్రిక్ చితంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నామన్నారు.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నామని తెలిపారు.