సినిమా వార్తలు

ప్రయోగాలు చేస్తున్న ప్రభాస్?


11 months ago ప్రయోగాలు చేస్తున్న ప్రభాస్?

బాహుబలి అమోఘ విజయం తరువాత ప్రభాస్ ఏ ధర్శకుడితో  సినిమా చేస్తాడో అని అంతా అనుకున్నారు. అయితే ప్రభాస్ కొత్త దర్శకుడు సుజీత్ ని ఎంకరేజ్ చేస్తూ “సాహో” సినిమా మొదలెట్టాడు. ఇది ఒక రకంగా ప్రయోగమనే అనుకోవాలి.  ఎందుకంటే సుజిత్ కేవలం ఒక్క సినిమా మాత్రమే డైరెక్ట్ చేసాడు. పోనీ ఆ సంగతిని పక్కన పెడితే... ప్రభాస్ మళ్ళీ మరో సినిమా కూడా “జిల్” అనే ఫ్లాప్ చిత్రానికి దర్శకత్వం వహించిన రాధాకృష్ణ దర్శకత్వంలో “జాన్” అనే సినిమా చేస్తున్నాడు. ”బాహుబలి” “బాహుబలి 2” చిత్రాల ద్వారా ప్రభాస్ స్టార్ డమ్ అమాంతం పెరిగింది. అయితే ఆ చిత్రాల తర్వాత ప్రభాస్ మళ్ళీ అగ్ర దర్శకులతో సినిమాలు చేయాల్సింది పోయి ప్రయోగాలు చేస్తున్నాడని, అది బెడిసి కొడితే రాజమౌళి సెంటిమెంట్ ని నిజం చేసిన వాడు అవుతాడని ప్రభాస్ ఫ్యాన్స్ భయపడుతున్నారట. ఇంతకీ రాజమౌళి కి ఉన్న సెంటిమెంట్ ఏమిటనుకుంటున్నారా? రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోకు ఇమేజ్ వస్తుంది కానీ ఆ సినిమా తర్వాత కోలుకోవాలంటే ఆ హీరోకు ఎంతో కాలం పడుతుంది. ఇప్పటివరకు రాజమౌళి తో సినిమా చేసిన తరువాత ఏ హీరో మళ్ళీ ఆ రేంజ్ లో విజయం సాధించలేదు. ఈ రకంగా చూసుకుంటే ప్రభాస్ పెద్ద రిస్కే చేస్తున్నాడనుకోవచ్చు. గతంలో ప్రభాస్ కు ఛత్రపతి చిత్రం విషయంలోనూ అదే జరిగింది. ఛత్రపతి సినిమా తరువాత చాలా రోజులకు గానీ ప్రభాస్ కు హిట్ పడలేదు. మరి ప్రభాస్ ప్రయోగాలు ఏమేరకు ఫలితాలిస్తాయో ముందుముందు చూడాలిమరి.