సినిమా వార్తలు

యంగ్ టైగర్‌ను జక్కన్న బిగ్‌బాస్‌కి పంపిస్తాడా?


10 months ago యంగ్ టైగర్‌ను జక్కన్న బిగ్‌బాస్‌కి పంపిస్తాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లి తెరపై  హోస్ట్ చేసిన బిగ్ బాస్ తో ఏ స్థాయిలో దూసుకెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండవ సీజన్ ను తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు హీరో నానితో నిర్వహించారు. రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించడాన్ని ప్రేక్షకులు పెద్దగా ఆమోదించినట్లుగా అనిపించలేదు. ఎన్టీఆర్ స్థాయిలో నాని మెప్పించలేక పోయాడనే వార్త వినిపిస్తుంటుంది. ఇప్పుడు మూడవ సీజన్ కు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. మూడవ సీజన్ కు హోస్ట్ ఎవరనే దానిపై చర్చ సాగుతోంది. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు మూడవ సీజన్ కు మళ్లీ ఎన్టీఆర్ ను హోస్ట్ గా తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చరణ్ తో కలిసి మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ భారీ మల్టీస్టారర్ మూవీ ఎక్కువగా హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరిగే అవకాశాలున్నాయి. అందుకే ఎన్టీఆర్ బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించేందుకు ఇబ్బంది ఉండదనే వాదన వినిపిస్తోంది. దాంతో తప్పకుండా ఎన్టీఆర్ మూడవ సీజన్ కు ఒప్పుకుంటాడని బిగ్ బాస్ నిర్వాహకులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ విడుదల అయ్యేందుకు చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ గ్యాప్ లో ప్రేక్షకులకు చేరువగా ఉండేందుకు ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 3 కి ఓకే చెప్తాడంటూ నిర్వాహకులు భావిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ను బిగ్ బాస్- 3 కి రాజమౌళి(జక్కన్న) పంపిస్తాడా? లేదా అనేది తెలియాల్సివుంది. సాధారణంగా రాజమౌళి సినిమా చేసే సమయంలో అందులోని హీరో మరే ప్రాజెక్ట్ లకు కమిట్ అవ్వరు. అలాగే ఎన్టీఆర్ కూడా బిగ్ బాస్ కు ఓకే చెప్పడేమోనని అంటున్నారు. మరి ఏమవుతుందో వేచిచూడాల్సిందే మరి.