సినిమా వార్తలు

క్లాస్విగా ఉండబోతున్న 'వినయ విధేయ రామ' ఫస్ట్ లుక్?


10 months ago క్లాస్విగా ఉండబోతున్న 'వినయ విధేయ రామ' ఫస్ట్ లుక్?

రామ్ చరణ్ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న 'వినయ విధేయ రామ' ఫస్ట్ లుక్ ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు విడుదల కానుంది. అయితే ఫస్ట్ లుక్ క్లాస్ గా ఉండాలా లేక మాస్ గా ఉండాలా అనే విషయమైన యూనిట్ కాస్త తర్జన భర్జన పడినట్లు తెలుస్తోంది. బోయపాటి రెండు షేడ్స్ లోని ఫస్ట్ లుక్ పోస్టర్లను రెడీ చేసి పెట్టుకోగా, ఎక్కువ ఓట్లు క్లాస్ లుక్ కె పడ్డాయట. టైటిల్ కూడా క్లాస్ గా ఉండటం వలన మొదట క్లాస్ లుక్ నే విడుదల చేస్తే మంచిదని యూనిట్ భావిస్తోందట.

కాగా రామ్ చరణ్ ఈ ఫస్ట్ లుక్ లో అచ్చమైన తెలుగు యువకుడిలా పంచెకట్టుతో కనిపిస్తాడని అంటున్నారు. అజర్ బైజాన్ లోని ఫైట్ సీక్వెన్స్ లుక్ కూడా చాల బాగుంటుందట, కానీ అది మాస్ లుక్ కావటం తో మొదట ఈ క్లాస్ లుక్ ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా, విషయం లెలియాలంటే మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిందే. 

ఈ చిత్రం లో కియారా అద్వానీ హెరాయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం టీజర్ ను నవంబర్ 9 వ తేదీన ఉదయం 10:25 కి విడుదల చేయనున్నారు.