సినిమా వార్తలు

ఎప్పుడూ అదే ప్రశ్నఅడుగుతారెందుకు?: నాగార్జున


1 year ago ఎప్పుడూ అదే ప్రశ్నఅడుగుతారెందుకు?: నాగార్జున

టాలీవుడ్ హీరోలు అక్కినేని నాగార్జున, నాని ప్రధాన పాత్రల్లో నటించిన దేవదాస్ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్ లో నిర్వహించిన ఇంటర్వ్యూలో నాగార్జున పలు అంశాలపై మాట్లాడారు. తాను అసలు పేపర్ చదవననీ, టీవీ చూడనని నాగార్జున స్పష్టం చేశారు.‘మీ ఫిట్ నెస్ రహస్యం ఏంటి?’ అని ఎవరైనా అడిగితే తనకు పిచ్చ కోపం వస్తుందని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న రిపీటవుతూ ఉంటుందని వ్యాఖ్యానించారు. దీనికి తోడుగా తన గురించి ప్రస్తావించాల్సి వస్తే 59 ఏళ్ల నాగార్జున అంటూ చెబుతారని వ్యంగ్యంగా స్పందించారు. ఇది తన ఒక్కడికి మాత్రమే జరుగుతోందని సరదాగా చెప్పారు. మల్టీ స్టారర్ మూవీ కావడంతోనానితో పోటీ పడి నటించాల్సి వచ్చిందని చెప్పారు. నాగార్జున, నాని కలిసి నటించిన 'దేవదాస్‌' చిత్రానికి బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వినీదత్ నిర్మించారు. సినిమా ఫస్ట్ వీక్ పూర్తయిన సందర్భంగా కలెక్షన్స్ వివరాలు ప్రటిస్తూ చిత్ర బృందం మీడియా మీట్ ఏర్పాటు చేసింది. ఈ మీటింగులో నాగార్జునతో పాటు అశ్వినీదత్, శ్రీరామ్ ఆదిత్య పాల్గొన్నారు. మాలో అందరికీ వ్యక్తిగతంగా చాలా హ్యాపీగా ఉంది. దత్తుగారు ఈ సినిమాకు వచ్చిన ఫిగర్స్‌ చెబితే ఆనందంగా అనిపించిందని నాగార్జున పేర్కొన్నారు.