సినిమా వార్తలు

ఈ వారం విజేత ఎవ‌రో?


7 months ago ఈ వారం విజేత ఎవ‌రో?

ప్రస్తుతం థియేటర్ల‌లో ‘అరవింద సమేత’ హావా నడుస్తుంది. త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన‌ ఈ క్రేజీ చిత్రం ప్రస్తుతం కలెక్షన్స్ జోరు కొనసాగిస్తోంది. ఈ స‌మ‌యంలోనే అక్టోబ‌రు 18న మ‌రో రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. అందులో ఒకటి రామ్ – అనుపమ జంటగా నటించిన ‘హలో గురు ప్రేమ కోసమే’. ఈసినిమా పై అంత‌గా అంచనాలు లేకపోయినా విడుదల అయ్యాక ఏమైనా అద్భుతాలు చేస్తుందేమో అని భావిస్తున్నారు.

ఇక అదే రోజున తమిళ – తెలుగులో విశాల్ నటించిన ‘పందెం కోడి 2 ‘ కూడా రిల‌జ్ కానుంది. ఈసినిమాపై అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో అంచనాలున్నాయి. ‘పందెం కోడి’ కి సీక్వెల్ గా వస్తున్న‌ సినిమాలో విలన్ పాత్రలో విశాల్‌ మాజీ గర్ల్ ఫ్రెండ్ వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుంది.  ఇందులో విశాల్ – వార లక్ష్మి మధ్య జరిగే మైండ్ గేమ్ తో కథ రసవత్తరంగా సాగుతుందని టాక్. సెకండ్ హాఫ్ లో వీరి సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందంటున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమా పూర్తిగా తమిళ నేటివిటీతో ఉండటం మనవరకు కొంత మైనస్ అయ్యేలా ఉంది. విశాల్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. రామ్ సినిమాకి పోటీగా వస్తున్నా ఈసినిమా నిలబడుతుందా? లేదా రామ్ సినిమా నిలబడుతుందా? త్వ‌ర‌లో తేలిపోనుంది.