సినిమా వార్తలు

ఎల‌క్ష‌న్ రోజున సినిమాల సెల‌క్ష‌న్‌, క‌లెక్ష‌న్‌


7 months ago ఎల‌క్ష‌న్ రోజున సినిమాల సెల‌క్ష‌న్‌, క‌లెక్ష‌న్‌

డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నిక‌లు ఉండటంతో ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఆరోజు సెలవు దినంగా ప్రకటించింది తెలంగాణ ప్ర‌భుత్వం. ఈ సెలవును క్యాష్ చేసుకునేందుకు టాలీవుడ్ నిర్మాతలు పోటీ పడుతున్నారు. అదే రోజున ప‌లు సినిమాలను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. 

కవచం:

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు శ్రీ‌నివాస్ మామిళ్ళను ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’ టీజర్, ట్రైలర్స్‌‌లలో పోలీస్ ఆఫీసర్‌గా బాగానే ఆకట్టుకున్నాడు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో కొత్త దర్శకుల హవా నడుస్తుండటంతో శ్రీ‌నివాస్ మామిళ్ళ ఈ ఫ్లో కంటిన్యూ చేసేట్టే కనిపిస్తున్నాడు. మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హ‌ర్షవ‌ర్ధ‌న్ రాణే, పోసాని కృష్ణ‌ముర‌ళి, స‌త్యం రాజేష్, అపూర్వ‌ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

నెక్స్ట్ ఏంటి:

తమన్నా, సందీప్ కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం 'నెక్స్ట్ ఏంటి'. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవదీప్, పూనమ్ కౌర్‌లు ముఖ్యపాత్రల్లో క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ టాప్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకుడు. ఆయన హిందీలో ‘ఫనా’, ‘హమ్ తుమ్’ లాంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించి తెలుగులో నెక్స్ ఏంటి చిత్రాన్ని రూపొందించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. నేటి జనరేషన్‌కి కనెక్ట్ అయ్యేలా సెక్స్, రొమాన్స్, లవ్ మేలవింపుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

సుబ్రహ్మణ్యపురం:

‘మళ్లీరావా’ సినిమా విజయంతో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సుమంత్ సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ కథాంశాల ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇది సుమంత్‌కు 25 చిత్రం. సుమంత్ సరసన ఈషా రెబ్బ హీరోయిన్. సంతోష్ జాగర్లమూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తారస్‌ సినీకార్ప్‌ పతాకంపై ధీరజ్‌ బొగ్గారం, బీరం సుధాకర్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. టీజర్‌, ట్రైలర్ ఆక‌ట్టుకుంటున్నాయి

 శుభలేఖ+లు

శ్రీ‌నివాస్‌సాయి, ప్రియ‌వ‌డ్ల‌మాని, దీక్ష‌శ‌ర్మ‌రైనా, ఇర్ఫాన్‌, సింధు, తిరువీర్‌, వంశీరాజ్‌, మోనాబేద్రె, అప్పాజిఅంబ‌రీష త‌దిత‌రులు నటిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రం‘శుభలేఖ+లు’. ఈ చిత్రంలో నటించిన హీరో శ్రీనివాస్ సాయి ‘గోల్కొండ హైస్కూల్’ చిత్రంలో బాల నటుడిగా నటించాడు. శుభలేఖ+లు చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. దీనికి తోడు ఈ చిత్ర ట్రైలర్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేయడంతో అంచనాలు నెల‌కొన్నాయి. ట్రైలర్‌ కూడా యూత్‌ని ఆక‌ట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి శరత్ నర్వాడే దర్శకత్వం వహించగా.. విద్యాసాగ‌ర్‌, జ‌నార్ధ‌న్‌, బెల్లం కృష్ణారెడ్డి నిర్మించారు.

భైరవగీత

ధనంజయ, ఇర్రా మోర్ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించిన రొమాంటిక్ మూవీ 'భైరవగీత'. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వర్మ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. కాగా టీజర్, ట్రైలర్‌లతో వర్మ మార్క్ చూపించిన ‘భైరవగీత’ చిత్రాన్ని ఆర్జీవీ తనదైన శైలి ప్రమోషన్స్ నిర్వహిస్తూ.. 2.0 చిత్రానికి పోటీగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించి చివర్లో వెనకడుగు వేశారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల డిసెంబర్ 7 విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన వర్మ.. థియేటర్స్ కొరత వల్ల కన్నడలో మాత్రమే విడుదల చేస్తున్నారు.