సినిమా వార్తలు

నిర్ణయ ధీరుడు ఎన్టీఆర్


10 months ago నిర్ణయ ధీరుడు ఎన్టీఆర్

తెలంగాణలోని కూకట్‌పల్లి అసెంబ్లీ సీటు నుంచి తన సోదరి పోటీకి దిగినప్పటికీ ప్రజాకూటమి తరఫున ఎన్టీఆర్‌ ప్రచారానికి రాలేదు. అయితే అతనిపై ఒత్తిడి పెంచేలా ఎన్టీఆర్ ప్రచారానికి వస్తున్నాడంటూ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ, ఎన్టీఆర్‌ వీటికి స్పందించకుండా షూటింగ్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు కళ్యాణ్‌రామ్‌ కూడా ప్రచారానికి రాలేదు. ఎన్టీఆర్‌ రాకపోవడంపై నందమూరి అభిమానుల్లో విభిన్నఅభిప్రాయాలు వెలువడ్డాయి.  అయితే ఇప్పుడు వచ్చిన ఫలితాలు చూసాక తారక్‌ ప్రచారానికి రాకపోవడమే మంచిదయిందని అభిమానులు అంటున్నారు. అయితే ఇప్పుడు వస్తోన్న ఈ స్పందనలతో ఎన్టీఆర్‌కి రాజకీయ పరంగా ముందస్తు ప్రణాళికపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చిందని అంటున్నారు.

అయితే ఏప్రిల్‌లో జరిగే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ ప్రచారాన్ని చంద్రబాబు, బాలయ్య ఆశించే అవకాశాలున్నాయి. తెలంగాణలో పరాభవం నేపథ్యంలో ఎన్టీఆర్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయి. అయితే ఈ విషయంలో ప్రజాభిప్రాయం ఎలా వుంది? తాను రాకపోవడంపై అభిమానుల మనోగతం ఏమిటనే విషయాలని విశ్లేషించుకునే అవకాశం ఈ ఎన్నికల ద్వారా ఎన్టీఆర్‌కు వచ్చిందంటున్నారు. తారక్‌ ప్రచారానికి రాకుండా మంచి పనే చేసాడనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీంతో అతను ఏపీలోనూ ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు అతని చేతిలో రాజమౌళి చిత్రం ఉంది. మరి భవిష్యత్‌లో ఎన్టీఆర్ ఏమి చేయనున్నాడో వేచిచూడాల్సిందే మరి.