సినిమా వార్తలు

టూర్ నుంచి తిరిగొచ్చాం: సమంత


1 year ago టూర్  నుంచి తిరిగొచ్చాం: సమంత

విదేశీ పర్యటనలో సరదాగా గడిపిన అక్కినేని కుటుంబం తమ అభిమానుల కోసం సామాజిక మాధ్యమాల ద్వారా ఫొటోలను షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. తమ టూర్ ముగించుకుని అక్కినేని కుటుంబం తిరిగి ఇండియాకు చేరుకుంది. ఈ విషయాన్ని నాగార్జున, సమంత తమ ట్వీట్ల ద్వారా తెలిపారు. అయితే, తమ పెళ్లిరోజు విషయాన్ని కూడా సమంత తన పోస్ట్ లో ప్రస్తావించింది. నాగచైతన్యంతో వివాహం తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఆయన పక్కనుంటే తనకు ఎంతో ధైర్యంగా ఉంటుందని చెప్పింది. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వవంలో సమంత, నాగ చైతన్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. సమంత, నాగ చైతన్య  షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. గతంలో ‘ఏమాయచేసావే, ఆటో నగర్ సూర్య, మనం’ చిత్రాలు కలిసి చేసిన చైతు, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న  చిత్రం ఇదే కావడం విశేషం. కాగా ఈ చిత్రం టైటిల్‌ ‘మజిలి’ అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఈ టైటిల్ నే ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే మజిలీ టైటిల్ ను రిజిస్టర్ కూడా చేయించారట. ఇక ఈ చిత్రం భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని తెలిపేలా తెరకెక్కనుంది. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.