సినిమా వార్తలు

‘పందెం కోడి- 3'కి సిద్ధం: విశాల్


11 months ago ‘పందెం కోడి- 3'కి సిద్ధం: విశాల్

విశాల్ హీరోగా లింగుస్వామి తెరకెక్కించిన 'పందెం కోడి 2' ఈ నెల 18వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదలైన విషయం విదితమే. తమిళంలో మాస్ ఆడియన్స్ ను అలరిస్తూ భారీ వసూళ్ల దిశగా సాగిపోతోంది. ఇక తెలుగులోనూ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగులో ఈ సినిమాను 6 కోట్లకి కొనుగోలు చేస్తే, 5 రోజులకే 5 కోట్ల 63 లక్షలకి పైగా షేర్ ను రాబట్టిందని సమాచారం. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుండటంపై హీరో విశాల్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 'పందెం కోడి' సినిమా తనకు బాగా కలిసొచ్చిందనీ, అందుకే 'పందెం కోడి 3'ని కూడా రూపొందించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు.

అందుకు సంబంధించిన స్క్రిప్ట్ ను సిద్ధం చేయమని లింగుస్వామికి ఇప్పటికే చెప్పానని అన్నారు. ఇక కీర్తి సురేశ్ మాట్లాడుతూ .. 'మహానటి' తరువాత ఒక మాస్ రోల్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. అదృష్టం కొద్దీ నాకు ఈ సినిమాలో ఛాన్స్ దక్కింది. మాస్ రోల్ చాలా బాగా చేశానని అంతా అంటూ వుంటుంటే సంతోషంగా వుందన్నారు.