సినిమా వార్తలు

త్వరలో విశాల్ వివాహం


9 months ago త్వరలో విశాల్ వివాహం

ప్రముఖ సినీ నటుడు విశాల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, నిర్మాత జీకే రెడ్డి వెల్లడించారు. అనీశా అనే యువతిని విశాల్ పెళ్లాడబోతున్నారు. నిశ్చితార్థ వేడుక త్వరలోనే హైదరాబాదులో జరగనుంది. నిశ్చితార్థం పనులను ప్రారంభించే పనిలో విశాల్ కుటుంబీకులు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, సినీ నటి వరలక్ష్మి (నటుడు శరత్ కుమార్ కుమార్తె)ను విశాల్ పెళ్లాడనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ వీరి వివాహంపై చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవలే ఈ అంశంపై వరలక్ష్మి మాట్లాడుతూ విశాల్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని వెల్లడించారు.