సినిమా వార్తలు

‘పెళ్లి చూపులు’ నటితో విశాల్ వివాహం


8 months ago ‘పెళ్లి చూపులు’ నటితో విశాల్ వివాహం

ప్రముఖ దక్షిణాది హీరో విశాల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఆయన తండ్రి జీకే రెడ్డి ఇటీవల ప్రకటించారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె అనీషాతో విశాల్ వివాహం జరగబోతోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో విశాల్ కు కాబోయే భార్య ఎలా ఉంటారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా ఈ సస్పెన్స్ కు అనీషా తెరదించారు. విశాల్ తో దిగిన ఫొటోను విడుదల చేసిన అనీషా, త్వరలోనే కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నట్లు తెలిపారు ఈ మేరకు అనీషా ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు. హైదరాబాద్‌ బిజినెస్‌మేన్‌ విజయ్‌ రెడ్డి, పద్మజల కుమార్తె అయిన అనీషా.. అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు సినిమాల్లో నటించారు. కాగా, అనీషా ఇకపై సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.