సినిమా వార్తలు

టాలీవుడ్‌లోనూ మీటూ ప్రకంపనలు


11 months ago టాలీవుడ్‌లోనూ మీటూ ప్రకంపనలు

మీ టూ ఉద్యమం ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను వణికించేందుకు సిద్ధమవుతోంది. త్వరలో బడా హీరోలు, దర్శకులు, నిర్మాతల లైంగిక వేధింపుల వ్యవహారాల్ని బయటపెట్టడానికి నటీమణులు, సాంకేతిక నిపుణులు సిద్ధమయ్యారని సమాచారం. ప్రముఖ యాంకర్ సుమ కనకాల నేతృత్వంలో దీనికి కార్యాచరణ జరుగుతోంది.

తమపై జరిగిన లైంగిక వేధింపుల్ని ఎలా బయపెట్టాలా అన్న అంశంపై ఫిల్మ్ చాంబర్ బిల్డింగ్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మీ టూలో వ్యవహరించాల్సిన విధివిధానాల గురించి చర్చించారు. యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందినీ రెడ్డి కూడా సమావేశానికి హాజరయ్యారు. గతంలో శ్రీరెడ్డి అనే నటీమణి కాస్టింగ్ కౌచ్ ఆరోపణల్ని తీసుకొచ్చినపుడు ఇండస్ట్రీ లైట్ తీసుకుంది.

తనూశ్రీదత్తా ప్రారంభించిన “మీ టూ” క్యాంపైన్.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అందరూ భయపడకుండా.. తమ తమ పై జరిగిన లైంగి వేధింపుల ఘటనలను ఇప్పుడు బయటపెడుతున్నారు. దీనికి టాలీవుడ్ అగ్ర హీరోయిన్లు సమంత, కాజల్, అనుష్కలు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు.