సినిమా వార్తలు

సంక్రాంతికి 'వినయ విధేయ రామ'


9 months ago సంక్రాంతికి 'వినయ విధేయ రామ'

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'వినయ విధేయ రామ' అనే టైటిల్ ను ఇటీవలే ఖరారు చేశారు. ఈ సినిమాలో చరణ్ జోడీగా కైరా అద్వాని నటించారు. ఈ సినిమా షూటింగులో తీవ్ర జాప్యం జరుగుతోందనీ, సంక్రాంతికి విడుదల కావడం కష్టమేననే ప్రచారం సాగుతోంది. వీటి నేపథ్యంలో ఈ విషయాన్ని గురించి దర్శక నిర్మాతలు స్పందించారు. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయిందనీ, రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని తెలిపారు.

నవంబర్ 10వ తేదీ నాటికి మిగిలిన చిత్రీకరణను కూడా పూర్తిచేస్తామన్నారు. షూటింగ్ పూర్తయిన వెంటనే డబ్బింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టనున్నామనీ, సంక్రాంతికి ఈ సినిమాను తప్పకుండా విడుదల చేస్తామని అన్నారు. త్వరలోనే ఫస్టులుక్ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నామనే గుడ్ న్యూస్ తెలిపారు. మొత్తానికి సంక్రాంతిబరిలో చరణ్ రాక ఖాయమైపోయిందని తెలుస్తోంది.