సినిమా వార్తలు

ఘనంగా ‘వినయ విధేయ రామ’ ఆడియో సీడీ ఆవిష్కరణ


9 months ago ఘనంగా ‘వినయ విధేయ రామ’ ఆడియో సీడీ ఆవిష్కరణ

రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ‘వినయ విధేయ రామ’ చిత్రం ఆడియో సీడీని  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఆవిష్కరించారు.ఈ చిత్రం విజయవంతం కావాలని కేటీఆర్ చిత్రయూనిట్ ని అభినందించారు. ఈ వేడుకకు చిత్రయూనిట్ తో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు.

కేటీఆర్ మరింతగా ఎదగాలి: రామ్‌చరణ్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన కేటీఆర్ తన స్నేహితుడు అని చెప్పుకునేందుకు తాను గర్వపడుతున్నాననిహీరో రాంచరణ్ అన్నాడు. కేటీఆర్ గొప్ప నాయకుడని, యువతకు స్ఫూర్తి దాయకుడు అని పేర్కొన్నారు. ఆయన లవబుల్ పర్సన్ అని అన్నారు. ఈసారి మరింత బాగా పాలించి మంచి పేరు సంపాదించుకోవాలని, మరింత గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.