సినిమా వార్తలు

27 న 'వినయ విధేయ రామ' ట్రైలర్ రిలీజ్!


9 months ago 27 న 'వినయ విధేయ రామ' ట్రైలర్ రిలీజ్!

చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' చిత్రం రూపొందింది. కైరా అద్వాని కథానాయికగా నటించిన ఈ సినిమా షూటింగ్ ఈ నెల 26తో పూర్తికానుంది. దీంతో 27న సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్, యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు వేగవంతంగా జరిగిపోతున్నాయి. కేటీఆర్, చిరంజీవి ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఇక చరణ్ తో గల సాన్నిహిత్యం కారణంగా ఎన్టీఆర్ కూడా ఈ వేడుకకు వస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేదికపై రాత్రి 9 గంటలకి ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. సినిమాపై మరింతగా అంచనాలు పెరిగేలా ఈ ట్రైలర్ ను బోయపాటి శ్రీను తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహా కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు.