సినిమా వార్తలు

అప్పుడే అంచనాలను దాటేసిన ‘వినయ విధేయ రామ’


9 months ago అప్పుడే అంచనాలను దాటేసిన ‘వినయ విధేయ రామ’

‘రంగస్థలం’ సినిమాతో హిట్ అందుకున్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రం మరింత విజయవంతం కావాలని పరితపిస్తున్నారు. అలాగే అభిమానులు కూడా ఆయన నుంచి మంచి వినోదాత్మక చిత్రాన్ని ఆశిస్తున్నారు. తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ చిత్రంలో కియారా అద్వాని హీరోయిన్‌. ఈ చిత్రం ఆడియో వేడుక ఈనెల 24న కానీ.. 27న కానీ జరగనుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని తెలుస్తోంది. జనవరిలో ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

ఇప్పటివరకూ బోయపాటి సినిమాలన్నీ మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూవచ్చాయి. కానీ ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అందుకే ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకునేందుకు బయ్యర్లు పోటీపడుతున్నారని తెలుస్తోంది. నైజాం ఏరియా హక్కులు రూ.24 కోట్లకి అమ్ముడు పోయాయట. దీంతో ఈ చిత్రం.. నాన్ 'బాహుబలి' రికార్డును క్రియేట్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇక హిందీ శాటిలైట్ హక్కుల డీల్ రూ.22 కోట్లకి కుదిరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.