సినిమా వార్తలు

ప్రమోషన్స్ జోరులో ‘వినయ విధేయ రామ’


9 months ago ప్రమోషన్స్ జోరులో ‘వినయ విధేయ రామ’

‘రంగస్థలం’తో హిట్ కొట్టిన హీరో రామ్ చరణ్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందని సమాచారం. దీనిలో భాగంగా ఈ చిత్రంలోని రెండవ పాటను డిసెంబర్ 15న విడుదల చేయాలనుకుంటున్నారట. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 24న నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అయితే వీటిపై ఇంకా అధికారిక సమాచారం అందనందున ఈ తేదీల్లో స్వల్ప మార్పు కూడా వుండే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది. బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనెర్ లో కియారా అద్వానీ కథానాయిక. కాగా వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దానయ్య డివివి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.