సినిమా వార్తలు

బాలయ్య సినిమాపై వినాయక్ క్లారిటీ


8 months ago బాలయ్య సినిమాపై వినాయక్ క్లారిటీ

సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు 'కథానాయకుడు' చిత్రాన్ని అందించిన బాలకృష్ణ, ప్రస్తుతం 'మహానాయకుడు' సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా వున్నారు. ఈ సినిమా తరువాత ఆయన బోయపాటితోను, అనిల్ రావిపూడితోను సినిమాలు చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో కొంతకాలంగా బాలకృష్ణతో సినిమా చేయడానికి వినాయక్ చేస్తోన్న ప్రయత్నాలు ఫలించలేదనే వార్తలు వినిపిపిస్తున్నాయి. ఇక ఇప్పట్లో వినాయక్ తో బాలకృష్ణ సినిమా ఉండకపోవచ్చనే టాక్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో వినాయక్ మాట్లాడుతూ, బాలకృష్ణతో తన సినిమా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు ఉంటుందని తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు బాలకృష్ణతో బోయపాటి సినిమా తరువాత ఉంటుందా? అనిల్ రావిపూడి సినిమా తరువాత ఉంటుందా? అనేది తెలియాల్సివుంది. గతంలో బాలకృష్ణ .. వినాయక్ కాంబినేషన్లో 'చెన్నకేశవ రెడ్డి' వచ్చిన విషయం విదితమే.