సినిమా వార్తలు

27న‌ 'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్ ఈవెంట్


9 months ago 27న‌ 'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్ ఈవెంట్

చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ'ను రూపొందిస్తున్న విష‌యం విదిత‌మే డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని అల‌రించ‌నుంది.. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్లాన్ చేశారు. ఈ నెల 26వ తేదీతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. అందువలన 27వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను నిర్వహించనున్నార‌ని స‌మాచారం. ఇదే వేదికపై ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, స్నేహ .. ప్రశాంత్ కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది.