సినిమా వార్తలు

‘నోటా' ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ జోరు


11 months ago ‘నోటా' ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ జోరు

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తమిళ - తెలుగుభాషల్లో 'నోటా' సినిమా రూపొందింది. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో విజయ్ దేవరకొండ ఉత్నాహం చూపిస్తున్నారు. ఇప్పటికే తమిళనాట ప్రమోషన్స్ ను పూర్తి చేసిన ఆయన, తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఈ సినిమా వైపుకి తిప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. 'ది నోటా పబ్లిక్ మీట్' పేరుతో తెలుగు రాష్ట్రాల్లో రెండు ఈవెంట్స్ ను జరపడానికి సన్నాహాలు చేశారని తెలుస్తోంది. ఈ నెల 30వ తేదీన విజయవాడ - బెంజ్ సర్కిల్లోని 'ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్'లో ఒక ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఇక మరొక ఈవెంట్ ను అక్టోబర్ 1వ తేదీన హైదరాబాద్ .. యూసఫ్ గూడాలోని 'కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం'లో నిర్వహించనున్నారు. భారీస్థాయిలో ప్లాన్ చేసిన ఈవెంట్స్ ఈ సినిమా సక్సెస్ కి ఎంతవరకూ హెల్ప్ దోహదపడతాయేది వేచిచూడాలి. మరోవైపు విజయ్‌ దేవరకొండకు సంబంధించిన మరో వార్తకూడా నెట్ లో చక్కర్లు కొడుతోంది. విజయ్ తన తమ్ముడిని తెరంగేట్రం చేయించేందుకు ఇదే సరైన సమయమని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆనంద్‌ దేవరకొండ హీరోగా పరిచయం కానున్న సినిమాలో హీరో రాజశేఖర్‌ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్‌ గా పరిచయం కానుంది. తెలంగాణ నేపథ్యంలో కథ ఉంటుందని, అక్టోబర్‌ 10న షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. పలు షార్ట్‌ ఫిలింస్‌ తో తానేంటో నిరూపించుకున్న కేవీఆర్‌ మహేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా, దగ్గుబాటి సురేష్‌ బాబు సమర్పణలో యష్‌ రంగినేని, మధుర శ్రీధర్‌ లు దీనికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారని సమాచారం.