సినిమా వార్తలు

విజయ్ సినిమా కాకినాడ షెడ్యూల్ పూర్తి


10 months ago విజయ్ సినిమా  కాకినాడ షెడ్యూల్ పూర్తి

హీరో విజయ్ దేవరకొండ సినిమా 'డియర్ కామ్రేడ్' షూటింగ్ వేగవంతంగా జరుగుతోంది. ఈ సినిమా మేజర్ షెడ్యూల్ ను కాకినాడలో చిత్రీకరణ చేస్తూ వచ్చారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నాడు. అందుకే కాకినాడ కాలేజ్ లోను .. ఆ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. తాజాగా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేశారు. విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్లో చిత్రీకరించిన సీన్స్ చాలా బాగా వచ్చాయని చిత్ర యూనిట్ చెబుతోంది. మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాకి, భరత్ కమ్మ దర్శకుడు. ఈ సినిమాను మే నెల రెండవ వారంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.