సినిమా వార్తలు

విజయ్‌కాంత్‌, అజిత్‌ల గొప్పతనమిదే: జ్యోతిక


8 months ago విజయ్‌కాంత్‌, అజిత్‌ల గొప్పతనమిదే: జ్యోతిక

పెళ్లి అయ్యాక రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇటీవల ‘కాట్రిన్‌ మొళి’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జ్యోతిక మరో రెండు కొత్త చిత్రాల్లో నటించడానికి అంగీకారం తెలిపారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఇతరుల సహకారం లేకుండా ప్రపంచంలో జీవించడం సాధ్యం కాదు. అలాగని చిన్న, చిన్న విషయాలకు మరో వ్యక్తి సాయం కోసం ఎదురుచూడడం కూడా తప్పే అవుతుంది. మనకు సహకరించినవారిని ఎప్పటికీ మరిచిపోకూడదు. అయితే కొందరు ఎంత సహాయం చేసినప్పటికీ బయటకు చెప్పుకోరు. అది వాళ్ల సహజ స్వభావం నటులు విజయ్‌కాంత్‌, అజిత్‌లు అంతటి గొప్ప మనస్సు కలవారు. వారు ఎంతంగా సహాయ, సహకారాలు అందించినప్పటికీ బయటకు పెద్దగా చెప్పుకోరని జ్యోతిక తెలిపింది.