సినిమా వార్తలు

ఫారెన్ సుందరితో విజయ్ దేవరకొండ ప్రేమాయణం?


12 months ago ఫారెన్ సుందరితో విజయ్ దేవరకొండ ప్రేమాయణం?

ఇది విజయ్ దేవరకొండ కొత్త సినిమా టైటిల్ అనుకుంటే పొరపడినట్టే.. ఇది సినిమా టైటిల్ కాదు ఈ కుర్రహీరో నిజమైన ప్రేమ వ్యవహారమట. విజయ్ దేవకొండ గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఫారెన్ సుందరితో విజయ్ దేవరకొండ ప్రేమాయణం సాగిస్తున్నట్లు దాని సారాశం. వీటికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ  గురించి చిన్న విషయమైనా మీడియాలో పెద్దదిగా అవుతోంది. సినీ తారల వ్యక్తిగత జీవితాల గురించి వార్తలు వైరల్ కావడం సహజమే. విజయ్ దేవరకొండ, ఓ ఫారెన్ సుందరి అంటూ పలురకాల కథనాలు వెలువడుతున్నాయి. విజయ్ దేవరకొండ, వర్జీని అనే ఫారెన్ యువత మధ్య ఘాటు ప్రేమ వ్యవహారం సాగుతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలకు బలాన్ని చేకూరుస్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ యువతి బెల్జియంకు చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు చిత్రంలో కూడా వర్జీని మెరిసింది. కాగా దగ్గబాటి రానా నెం 1 యారీ అనే షో లో కూడా వర్జీని కనిపించినట్లు తెలుస్తోంది. పెళ్లి చూపులు చిత్రం తరువాత ఏడాది పాటు ఆ యువతి తన కుటుంబ సభ్యులతో హైదరాబాద్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. 

విజయ్ దేవరకొండతోనే కాదు.. అతడి కుటుంబ సభ్యులతో కూడా వర్జీని సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో పాటు వర్జీని కుటుంబ సభ్యులు కూడా ఉండడం విశేషం. వర్జీని, విజయ్ దేవరకొండ మధ్య సాగుతున్నది కేవలం స్నేహమేనా లేక ప్రేమ వరకు వెళ్ళారా అనేది ఇంకా తెలియడం లేదు.  కాగా విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో విజయ్ పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు.