సినిమా వార్తలు

దసరా కానుకగా ‘నోటా’?.. పూర్తికాని ప్రొడక్షన్ పనులు?


1 year ago దసరా కానుకగా ‘నోటా’?.. పూర్తికాని ప్రొడక్షన్ పనులు?

విజయ్ దేవరకొండ అభిమానులంతా  'నోటా' సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విజయ్ దేవరకొండ జోడీగా మెహ్రీన్ .. సంచనా నటరాజన్ నటించారు. తెలుగు .. తమిళ భాషల్లో నిర్మితమైన ఈ సినిమాను, వచ్చేనెల 4వ తేదీన విడుదల చేయనున్నట్టు వార్తలు గతంలో వచ్చాయి. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడంలేదనే టాక్  వినిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది. ఈ కారణంగా ఈ సినిమాను దసరా కానుకగా వచ్చేనెల 18వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం.  దీంతో ఈ డేట్ కు ఆల్రెడీ రిలీజ్ ప్లాన్ చేసుకున్న రామ్ 'హలో గురు ప్రేమ కోసమే'.. విశాల్ 'పందెం కోడి 2' కు భారీ పోటీ ఎదురు కానుంది.  మరోవైపు ఎన్టీఆర్ 'అరవింద సమేత వీర రాఘవ' ఒక వారం ముందుగా అక్టోబర్ 11 న రిలీజ్ కానుంది. కాగా ఇటీవల  'నోటా' ట్రైలర్ విడుదలైంది. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు, అభిమానులు ముగ్ధులైపోతున్నారు. ఇప్పటి అతడు వరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా తెరరకెక్కిన ఈ పొలిటికల్ డ్రామాలో..... విజయ్ తన నట విశ్వరూపం చూపించాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. అనుకోకుండా సీఎం పీఠం ఎక్కిన విజయ్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు? రాజకీయ చదరంగంలో అతడు పావుగా మారాడా? లేక అందరినీ ఆటాడించాడా? అనే ఆసక్తి ఈ ట్రైలర్ ద్వారా అందరిలో పెరిగేలా చేశారు. రాజకీయ నాయకులు, స్వామీజీల ప్రస్తావన తేవడంతో పాటు వారి స్వార్థం, అధికార, ధన దాహం కోసం ఎలాంటి దారుణాలకు పాల్పడతారు అనేది ఈ సినిమాలో చూపించినట్లు సమాచారం.