సినిమా వార్తలు

కఠిన నిర్ణయం తీసుకున్న విజయ్ దేవరకొండ


9 months ago కఠిన నిర్ణయం తీసుకున్న విజయ్ దేవరకొండ

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ అకస్మాత్తుగా ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. గతకొంతకాలంగా విజయ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రను పోషిస్తున్న '83' అనే చిత్రంలో మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రను పోషించే అవకాశం విజయ్ కు వచ్చిందట. కానీ, ఆ ఆఫర్ ను విజయ్ సున్నితంగా తిరస్కరించాడని సమాచారం. వాస్తవానికి బాలీవుడ్ లోకి ఒక రేంజ్ లో ఎంట్రీ ఇవ్వాలనే యోచనలో విజయ్ ఉన్నాడట. అందుకే తన తొలి చిత్రంలో చిన్న పాత్రలో కనిపించడం ఇష్టం లేక... ఆఫర్ ను తిరస్కరించాడని అంటున్నారు. మరోవైపు విజయ్ తో ప్రముఖ సినీదర్శకుడు కరణ్ జొహార్ చర్చలు జరుపుతున్నాడని సినీవర్గాల టాక్ అంతా ఓకే అయితే, ఇద్దరూ కలసి ఒక భారీ ప్రాజెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.