సినిమా వార్తలు

ప్రముఖ క్రికెటర్ పాత్రలో విజయ్ దేవరకొండ


5 months ago ప్రముఖ క్రికెటర్ పాత్రలో విజయ్ దేవరకొండ

తెలుగులో స్వల్ప వ్యవధిలోనే స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ, 'నోటా' సినిమాతో కోలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చాడు. తరువాత ఆయన హిందీలోనూ ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలుగులో వరుస ప్రాజెక్టులతో బిజీగా వున్న విజయ్ దేవరకొండ, ఇప్పట్లో హిందీలో చేయకపోవచ్చని కూడా అంటున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైపోతోందని సమాచారం. 1983లో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో హిందీలో '1983' టైటిల్ తో ఒక సినిమా రూపొందించేందుకు సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్ర కోసం ఆల్రెడీ రణ్ వీర్ సింగ్ ను ఎంపిక చేసుకున్నారు. ఇక అప్పటి మ్యాచ్ విజయంలో కీలకమైన పాత్రను పోషించిన కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కోసం విజయ్ దేవరకొండను ఎంపిక చేశారని తెలుస్తోంది.