సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ సరసన జాన్వీ?


1 year ago విజయ్ దేవరకొండ సరసన జాన్వీ?

శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైనా ధడక్ సినిమాతో నటనపరంగా జాన్వీ కపూర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్ లో చాలా ఆఫర్లు వస్తున్నప్పటికీ ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ దక్షిణాది సినిమాలపై దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెతో ఇద్దరు తమిళ దర్శకులతో పాటు ఓ తెలుగు దర్శకుడు చర్చలు జరుపుతున్నారు. అన్నీ కొలిక్కి వస్తే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలుగు హీరో విజయ్ దేవరకొండ సరసన నటించవచ్చని తెలుస్తోంది. ముగ్గురు దర్శకులతో ప్రస్తుతం సినిమాలకు సంబంధించి జాన్వీ చర్చలు జరుపుతోందని భోగట్టా.  పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి వరుస హిట్లు ఇచ్చిన విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం ‘నోటా’ అక్టోబర్ 5న విడుదల కానుంది.