సినిమా వార్తలు

త్రిభాషా చిత్రంలో విజయ్ దేవరకొండ!


1 year ago త్రిభాషా చిత్రంలో విజయ్ దేవరకొండ!

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు 'నోటా' రెడీ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఈ నెల 5వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన నుంచి వచ్చే ఏడాది 'డియర్ కామ్రేడ్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన మరో తమిళ బ్యానర్లో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా సమాచారం. తమిళ నిర్మాత ఎస్.ఆర్. ప్రభు నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా రూపొందనుందని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ కూడా విజయ్ దేవరకొండకి ముట్టినట్టుగా చెబుతున్నారు. తమిళ .. తెలుగు భాషలతో పాటు మలయాళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. మొత్తానికి విజయ్ దేవరకొండ మూడు భాషల్లో మార్కెట్ పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇదిలావుండగా విజయ్ దేవరకొండ ఇటీవల 'పెళ్లి చూపులు' సినిమాను  ఎంపిక చేసుకునేందుకుగల కారణాలను చెప్పారు.  ఈ సినిమా చేయాలనే స్ఫూర్తిని నాలో కలిగించినది 'రెబల్ వితౌట్ ఎ క్రూ' అనే నవల. ఈ నవలను ఒక ఫ్రండ్ ఇస్తే చదివాను. ఈ నవలలో నాయకుడు తాను అనుకున్నది సాధించడం కోసం తన కిడ్నీని సైతం అమ్ముకుంటాడు. ఎన్ని కష్టాలు పడైనా అనుకున్నది సాధించాలనే విషయం ఈ పుస్తకం ద్వారా నాకు తెలిసింది. ఆ సమయంలోనే 'పెళ్లి చూపులు' కథ నా దగ్గరికి వచ్చింది. ఎవరమూ పారితోషికాలు తీసుకోకుండా .. బాధ్యతలను పంచుకుంటూ ఎన్నో కష్టాలు పడి ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాము.  మా కష్టానికి సురేశ్ బాబు రూపంలో అదృష్టం తోడు కావడంతో, మా దశ తిరిగిపోయింది" అని విజయ్ దేవరకొండ చెప్పాడు.