సినిమా వార్తలు

శ‌ర‌వేగంగా డియర్ కామ్రేడ్'


10 months ago శ‌ర‌వేగంగా డియర్ కామ్రేడ్'

'టాక్సీవాలా' విజయం సాధించడంతో విజయ్ దేవరకొండ అభిమానులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సక్సెస్ తెచ్చిన ఆనందంతో విజ‌య్‌ తన తదుపరి చిత్రం 'డియర్ కామ్రేడ్' షూటింగులో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు కాకినాడలోని మెడికల్ కాలేజ్ లో జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. అందువలన కాలేజ్ నేపథ్యంలో సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. మరికొన్ని రోజులపాటు అక్కడే షూటింగు జరపనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలోను విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. భరత్ కమ్మ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.