సినిమా వార్తలు

ఫోర్బ్స్ జాబితాలో చేరిన విజయ్ దేవరకొండ


9 months ago ఫోర్బ్స్ జాబితాలో చేరిన విజయ్ దేవరకొండ

సంచలనాల యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరో ఘన విజయం సాధించారు. 2018 సంవత్సరానికి గాను అత్యధిక ఆదాయాన్ని సంపాదించిన టాప్ 100 జాబితాలో విజయ్ దేవరకొండ చోటు దక్కించుకున్నాడు. ప్రముఖ మ్యాగ్జైన్ ఫోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో విజయ్ 14 కోట్ల తో 72వ స్థానంలో నిలిచి కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇక ఈ జాబితాలో దక్షిణాది నుండి సూపర్ స్టార్ రజినీ కాంత్ (50)కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు. తరువాత పవన్ కళ్యాణ్ (31.33 కోట్లు), హీరో విజయ్ (30.33 కోట్లు), ఎన్టీఆర్ (28 కోట్లు),విక్రమ్ (26 కోట్లు),మహేష్ బాబు (24.33), సూర్య (23.67 కోట్లు), విజయ్ సేతుపతి (23.67 కోట్లు), నాగార్జున (22.25కోట్లు), కొరటాల శివ (20కోట్లు) , ధనుష్ (17. 25 కోట్లు) , నయన తార (15.17కోట్లు), అల్లు అర్జున్ (15కోట్లు), రామ్ చరణ్ (14కోట్లు ) తరువాతి స్థానాలు దక్కించుకున్నారు. ఓవరాల్ గా 100 మంది జాబితాలో సల్మాన్ ఖాన్ (253.25)కోట్లతో అగ్ర స్థానంలో నిలిచారు. విరాట్ కోహ్లీ (228.09), అక్షయ్ కుమార్ (185)కోట్లతో  ఫోర్బ్స్ జాబితాలో చోటుదక్కించుకున్నారు.