సినిమా వార్తలు

తండ్రిగా మారేందుకు సిద్ధమైన విజయ్ దేవరకొండ


5 months ago తండ్రిగా మారేందుకు సిద్ధమైన విజయ్ దేవరకొండ

‘అర్జున్ రెడ్డి’ సంచలన విజయం తరువాత విజయ్ దేవరకొండ లైఫ్ స్టైల్ పూర్తిగా  మరిపోయింది. తరువాత చేసిన గీత గోవిందం ఎంతటి విజయం సాధించిందో మరి మాటల్లో చెప్పలేం.  ప్రస్తుతం విజయ్ ఓ కొత్త చిత్రం చేస్తున్నాడు. అందులో విజయ్ 8 ఏళ్ల అబ్బాయికి తండ్రిగా కనిపించనున్నారు. వివరాలు తెలుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందేనని దర్శకుడు క్రాంతి మాధవ్ చెబుతున్నారు. ఇటీవలే ఈ చిత్రం 15 రోజుల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్‌కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' చిత్రం తర్వాత క్రాంతి మాధవ్‌కు ఈ సినిమా మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో విజయ్.. సింగరేణి కార్మికులకు యూనియన్ లీడర్‌గా కనిపించనున్నాడు. మరోవైపు ప్రేమకథ కూడ ఈ చిత్రంలో మిళితమైవుంది. ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కాథరిన్, ఇజబెల్లి హీరోయిన్స్‌. ఈ సినిమాలో ఐశ్వర్వ గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కె. ఎస్ రామారావు నిర్మాత.