సినిమా వార్తలు

మరో ద్విభాషా చిత్రంలో విజయ్ దేవరకొండ


10 months ago మరో ద్విభాషా చిత్రంలో విజయ్ దేవరకొండ

అనతికాలంలోనే టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా విజయ్ దేవరకొండ నిలిచాడు. ‘పెళ్లిచూపులు’ చిత్రంతో విజయాన్ని అందుకున్న విజయ్‌ని ‘అర్జున్‌రెడ్డి’ టాప్ రేంజ్‌కి తీసుకెళ్లిందనేది విదితమే. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన ఇప్పుడో హాట్ స్టార్ గా మారిపోయారు. అర్జున్‌రెడ్డి కంటే ముందే విజయ్ సంతకం చేసిన ‘టాక్సీవాలా’ ఇటీవలే విడుదలై విజయవంతంగా నడుస్తోంది. దీంతో అతడితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ఏడాది తెలుగు, తమిళ భాషల్లో విజయ్ నటించిన ‘నోటా’ పరాజయం పాలైంది.

పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విఫలమైంది. ఈ చిత్రంతో కోలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్న విజయ్‌కు  తీవ్ర నిరాశే ఎదురైంది. అయితే ఈ అపజయంతో డీలా పడిపోకుండా విజయ్ మరో ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే మరో ద్విభాషా చిత్రంలో విజయ్ నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సంతకం చేశారని సమాచారం. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రియదర్శన్, రాహుల్ రామ‌కృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ఎస్.ఆర్. ప్రభు నిర్మాత. కాగా ఈ చిత్రానికి హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయాల్సివుంది.