సినిమా వార్తలు

కొత్త అవతారంలో విజయ్ దేవరకొండ


8 months ago కొత్త అవతారంలో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ తాను ఏది చేసినా కొత్తగా వుండాలని భావిస్తుంటాడు. నలుగురికీ భిన్నంగా అనిపించే నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాడు. తాజాగా ఆయన అలాంటి నిర్ణయమే తీసుకున్నాడని సమాచారం. హీరోగా వరుస సినిమాలతో బిజీగా వున్న ఆయన, నిర్మాతగా మారడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అవుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. చిన్న బడ్జెట్లో తన బ్యానర్లో నిర్మించే సినిమా ద్వారా 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా చూపించాలనుకుంటున్నారు. తనకి 'పెళ్లి చూపులు' ద్వారా మంచి హిట్ ఇచ్చినందుకు విజయ్ ఆ రుణాన్ని తీర్చుకుంటున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నదని సమాచారం. మరి ఈ సినిమా దర్శకుడు ఎవరో తెలియాలంటే కాస్త ఆగాల్సిందే!