సినిమా వార్తలు

పారితోషికం పెంపుపై విజయ్ దేవరకొండ క్లారిటీ


1 year ago పారితోషికం పెంపుపై విజయ్ దేవరకొండ క్లారిటీ

విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'నోటా' రానుంది. ఈ నెల 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. దాంతో ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. ఈ నేపథ్యంలోనే 'పారితోషికం బాగా పెంచేశారట గదా?' అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను .. ఈ రోజున నాకు ఇంత గుర్తింపు వచ్చింది. ఈ స్థాయికి రావడమే నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం .. స్టార్ డమ్ గురించి నేను ఆలోచించడం లేదు .. ఆశపడటం లేదు. ఇక ప్రతి సినిమాను ఇదే నా చివరి సినిమా అనుకుని చేస్తాను. సినిమా హిట్ అయింది కదా అని పారితోషికం పెంచేద్దాం అనే ఆలోచనే నాకు వుండదు.  పారితోషికం గురించి ఆలోచిస్తూ వెళితే మంచి సినిమాలు చేయలేము. అందువలన ఆ విషయాన్ని గురించి కాకుండా కథలో కొత్తదనం గురించి ఆలోచిస్తా. అదే నన్ను ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టింది. పారితోషికం విపరీతంగా పెంచాననే ప్రచారంలో నిజం లేదు" అని చెప్పుకొచ్చాడు.