సినిమా వార్తలు

మరో జయలలితగా విద్యాబాలన్


9 months ago మరో జయలలితగా విద్యాబాలన్

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవితం ఆధారంగా ఏకకాలంలో మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రియదర్శిని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నిత్యామేనన్‌ ‘అమ్మ’ పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు భారతిరాజా కూడా ‘అమ్మ’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంకోవైపు ఏఎల్‌ విజయ్‌... జయలలితకు సంబంధించిన మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు కోలీవుడ్‌ వర్గాలు తెలిపాయి.త్వరలోనే జయలలిత కుటుంబికుల అంగీకారం పొందనున్నట్లు సమాచారం.

మరోవైపు ఈ సినిమాలో జయలలిత పాత్రకు విద్యాబాలన్‌ను, ఎంజీఆర్‌ పాత్రకు అరవింద్‌స్వామిని ఎన్నుకున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను జయలలిత జయంతి (ఫిబ్రవరి 24)న విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ‘అమ్మా ఎండ్రాల్‌ అన్బు’ అనే టైటిల్‌ను ఈ చిత్రానికి గాను పరిశీలిస్తున్నారు.