సినిమా వార్తలు

‘బిగ్ బాస్’ హోస్ట్‌గా విక్టరీ వెంకటేష్?


9 months ago ‘బిగ్ బాస్’ హోస్ట్‌గా విక్టరీ వెంకటేష్?

తెలుగు రాష్ట్రాలలో ‘బిగ్‌బాస్’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. మరీ ముఖ్యంగా ‘బిగ్‌బాస్’ సీజన్-1తో పోలిస్తే.. సీజన్-2 చాలా వివాదాస్పదంగా నిలిచింది. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఎన్టీఆర్ క్రేజ్‌తో ఈ సీజన్ సూపర్ సక్సెస్‌గా నిలిచింది. టీఆర్పీ రేటింగ్స్ పరంగా కూడా తొలి సీజన్‌‌కు ఎన్టీఆర్ క్రేజ్ బాగా కలిసొచ్చింది. ఇక రెండవ సీజన్‌ని అంతకు మించిన మసాలాతో పాటు ‘ఏదైనా జరగొచ్చు’ అనే ట్యాగ్ తగిలించి అంచనాలు మరింతగా పెంచేశారు. సీజన్ 2కి హోస్ట్‌గా నాని కూడా బాగా చేశాడు. కానీ బిగ్‌బాస్ 2పై మాత్రం పలు విమర్శలు ఎదురయ్యాయి. ఇదిలావుండగా త్వరలో ‘బిగ్‌బాస్-3’ రాబోతోందని సమాచారం. ఈ సారి ఎలాంటి విమర్శలూ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనికి హోస్ట్‌గా విక్టరీ వెంకటేష్ వ్యవహరించనున్నట్టు సమాచారం.