సినిమా వార్తలు

కామెడీ పండించడం చాలాకష్టం: వరుణ్ తేజ్


9 months ago కామెడీ పండించడం చాలాకష్టం: వరుణ్ తేజ్

ఈసారి సంక్రాంతి బరిలో యంగ్ హీరో వరుణ్ తేజ్ సినిమా కూడా పోటీలో నిలబడుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' అనే మల్టీస్టారర్ రూపొందింది. ఈ సినిమాలో ఒక హీరోగా వెంకటేశ్, మరో హీరోగా వరుణ్ తేజ్ కనిపించనున్నారు. జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాను గురించి వరుణ్ తేజ్ మాట్లాడారు "ఈ సినిమా కామెడీ ప్రధానంగా సాగుతుందని చెప్పినప్పుడు నేను కొంచెం కంగారు పడ్డాను. రాజేంద్రప్రసాద్ .. వెంకటేశ్ తో కలిసి కామెడీని చేయవలసి ఉంటుందని చెప్పినప్పుడు మరికొంచెం టెన్షన్ పడ్డాను. ఆ ఇద్దరూ కామెడీని పండించడంలో లెజెండ్స్ అనే విషయం తెలిసిందేకదా! అలాంటివాళ్లతో కలిసి కామెడీ సీన్స్ చేయడం అంత ఆషామాషీ కాదనిపించింది. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి నా బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా కామెడీ ఉండేలా చూశారు. కాస్తంత కష్టంగా అనిపించినా, తెలంగాణ యాసలో మాట్లాడుతూ బాగానే కామెడీ చేశానని అనిపిస్తోంది. ఎలా చేశాననేది సినిమా చూశాక మీరే చెప్పాలి" అని వరుణ్‌తేజ్ అన్నాడు.