సినిమా వార్తలు

అక్టోబరు 26న ‘వీరభోగ వసంతరాయులు’


1 year ago అక్టోబరు 26న ‘వీరభోగ వసంతరాయులు’

‘వీరభోగ వసంతరాయలు’ చిత్రం అక్టోబర్ 26న విడుదల కానుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా ఇంద్రసేన తెరకెక్కించిన చిత్రంలో నారా రోహిత్, సుధీర్‌బాబు, శ్రీయాశరన్, శ్రీవిష్ణు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రం ఫస్ట్‌లుక్ చూస్తే కొత్త కాన్సెప్ట్ తో వస్తుందన్న విషయం అర్థమవుతుంది. ఆసక్తికరమైన టైటిల్, కొత్త మతం పుట్టకొస్తుందన్న ట్యాగ్‌లైన్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయ. బాబా క్రియేషన్స్ బ్యానర్‌పై అప్పారావ్ బెల్లానా నిర్మిస్తున్న చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం, ఎస్. వెంకట్, నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.