సినిమా వార్తలు

వెన్నెల కిషోర్ ‘చచ్చారుపో సీజన్ 1’


1 year ago వెన్నెల కిషోర్ ‘చచ్చారుపో సీజన్ 1’

తెలుగులో ప్రస్తుతం బిజీ కమెడియన్ అంటే వెన్నెల కిషోర్ పేరే చెప్పుకోవాలి. బ్రహ్మి హావ తగ్గడంతో వెన్నెల కిషోర్ తనదయిన కామెడీ తో మరింత రెచ్చిపోతున్నారు. దీంతో వరుస అవకాశాలు వెన్నెల తలుపు తడుతున్నాయి. ఇంత బిజీ టైం లో తాజాగా ఓ సరికొత్త షో ను మొదలు పెట్టాడు. కాకపోతే ఇది కేవలం సోషల్ మీడియా లో మాత్రమేనట. అదేంటి అనుకుంటున్నారా? అవును కిషోర్ ఎంత బిజీ గా ఉన్న కానీ సోషల్ మీడియా లో మాత్రం ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటారు. ఈ నటక్రమంలో తాజాగా ‘చచ్చారుపో సీజన్ 1’ అంటూ ఓ పాటను పాడి వీడియోను షేర్ చేశాడు. ఇక ఈ ఎపిసోడ్‌ను ‘తిన్నది అరక్క’ చేస్తున్నాడంటూ చెప్పి, దీనిని సింగర్ చిన్మయికి డెడికేట్ చేస్తున్నట్లు చెప్పి అందర్నీ నవ్వుల్లో ముంచెత్తారు. ఈ ట్వీట్‌కు నటుడు బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, చిన్మయి మధ్య జరిగిన సంభాషణ నెటిజన్ల చేత నవ్వులు పూయిస్తోంది. ఆ పాటకు తన ఎక్స్‌ప్రెషన్లతో ఓ వీడియోను చేసి వెన్నెల కిశోర్‌కు రిప్లై ఇచ్చాడు నవదీప్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

https://twitter.com/vennelakishore/status/1045299860553916416