సినిమా వార్తలు

షురూ కాబోతున్న వెంకీమామ


7 months ago షురూ కాబోతున్న వెంకీమామ

హీరోలు వెంకటేష్‌, నాగచైతన్య కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘వెంకీమామ’. బాబీ దర్శకుడు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ వారం నుంచే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందులో నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తుండగా, వెంకటేష్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌ ను ఎంపికచేసినట్లు తెలుస్తోంది. గతంలో వెంకీతో శ్రియ నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఆమె స్థానంలో పాయల్‌ని ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. తొలి చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’తోనే పాయల్ ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం  పాయల్ వరుస అవకాశాల్ని అందుకొంటోంది. ఈ చిత్రంలో వెంకీ పల్లెటూరి వ్యక్తిగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. పట్టణంలో పుట్టి పెరిగిన కుర్రాడిగా నాగచైతన్య సందడి చేస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.