సినిమా వార్తలు

ఒక వెంకీ...మరో రెండు మల్టీస్టారర్స్‌


1 year ago ఒక వెంకీ...మరో రెండు మల్టీస్టారర్స్‌

వెంకటేశ్ బాక్సాఫీస్‌కు 'మల్టీ'ధమాకా ఇస్తున్నట్లే కనిపిస్తోంది. ట్రెండ్‌కు తగ్గట్లుగా తనని తాను మార్చుకుంటూ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌తో ఆకట్టుకునే వెంకటేశ్ ఇప్పుడు వరుస మల్టీస్టారర్స్‌లో నటిస్తున్నారని సమాచారం. ఆల్రెడీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్‌తో కలిసి 'ఎఫ్-2'లో నటిస్తున్నాడు. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇక మేనల్లుడు నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ'గా అలరించబోతున్నాడు. వీటితో పాటు వెంకటేశ్ మరో రెండు మల్టీస్టారర్స్‌కు కమిట్ అయినట్లు సమాచారం. మళయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్‌తో ఓ సినిమా, అబ్బాయి రానాతో కలసి ఓ చిత్రంలో నటించబోతున్నాడట. వెంకటేశ్, రానా కాంబినేషన్‌లో రాబోయే మల్టీస్టారర్‌ని సురేశ్ బాబు నిర్మించబోతున్నాడట. సురేశ్ ప్రొడక్షన్స్ రూపొందించే ఈ చిత్రంలో వెంకీతో త్రిష జోడీ కడుతుందని చెబుతున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరు 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', 'నమో వెంకటేశ', 'బాడీగార్డ్' లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ కెమిస్ట్రీతోనే మళ్లీ వీళ్లిద్దరు కలిసి నటించబోతున్నారట. మరి రానాకు మంచి స్నేహితురాలైన త్రిష, ఈ మల్టీస్టారర్‌లో ఎలాంటి పాత్రలో కనిపించి మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే.