సినిమా వార్తలు

సెట్స్ పైకి 'వెంకీ మామ'


10 months ago సెట్స్ పైకి  'వెంకీ మామ'

హీరోలు వెంకటేశ్, నాగచైతన్య ప్రధాన పాత్రలుగా దర్శకుడు బాబీ ఒక కామెడీ ఎంటర్టైనర్ ను రూపొందించనున్నాడు. ఈ సినిమాకి 'వెంకీ మామ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది. వచ్చేనెల 12వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దిశగా పనులు జరుగుతున్నాయి. తొలి షెడ్యూల్ ను చెన్నైలో ప్లాన్ చేస్తున్నారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో చైతూ జోడీగా రకుల్ ను ఎంపికచేశారు. వెంకటేశ్ సరసన కథానాయికగా శ్రియను గానీ .. హ్యూమా ఖురేషిని గాని తీసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం. 'జై లవ కుశ' తరువాత బాబీ చేస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.