సినిమా వార్తలు

చాలారోజులకి ఒంటరిగా వస్తున్న వెంకీ!


8 months ago చాలారోజులకి ఒంటరిగా వస్తున్న వెంకీ!

సీనియర్ నటుడు వెంకటేష్ ఈ మధ్య మల్టీ స్టారర్ సినిమాల్లోనే ఎక్కువగా నటించటం మనం గమనించిన విషయమే. తనకు తగిన కధ దొరకకపోవటమే దీనికి కారణంగా తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం అయన తేజ దర్శకత్వం లో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. దానికి 'ఆట నాదే వేట నాదే' అనే టైటిల్ కూడా వినపడింది, కాకపోతే తేజ చెప్పిన ఫైనల్ కధ వెంకీ ని మెప్పించలేకపోవటం వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు సమాచారం. అలాగే వెంకీ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా రానున్నదనికూడా వార్తలు వచ్చాయి, అయితే త్రివిక్రమ్ వేరే హీరోల సినిమాలు ఒప్పుకోవటం వలన వీరి కాంబినేషన్ చూడటం కోసం మరికొంత కాలం వేచివుండక తప్పేలా లేదు. 

ఇదిలా ఉండగా తాజా గా వెంకీ, త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో ఒక మూవీ ఫైనల్ అయిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుందట. ఎట్టకేలకు వెంకీ ని సోలో హీరోగా చూసే అవకాశం ఫాన్స్ కి లభించబోతోంది. 

ప్రస్తుతం వెంకీ, వరుణ్ తేజ్ తో కలిసి నటిస్తోన్న 'F2 తో బిజీ గా ఉన్నారు. త్వరలో చైతు తో 'వెంకీ మామ' కూడా మొదలు కానుంది.