సినిమా వార్తలు

బిగ్ బాస్ గురించి చేప్పేసిన వెంకటేష్


8 months ago బిగ్ బాస్ గురించి చేప్పేసిన వెంకటేష్

దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో వెంకటేశ్ కాంబినేషన్లో 'ఎఫ్ 2' సినిమా రూపొందింది. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమా శనివారం భారీస్థాయిలో విడుదల కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో వెంకటేశ్బిజీగా మారిపోయారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. 'బిగ్ బాస్ 3' షోకి తాను హోస్ట్ గా వ్యవహరించనున్నానంటూ జరుగుతోన్న ప్రచారాన్ని గురించి ప్రస్తావించారు. 'బిగ్ బాస్ 3' షోకి నేను హోస్ట్ గా చేయనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు. ఇదంతా కేవలం రూమర్ మాత్రమేనని స్పష్టం చేశారు. 'బిగ్ బాస్ 3' నిర్వాహకులు వెంకటేశ్ తో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్త తరువాతనే చిరంజీవి పేరు కూడా తెరపైకి వచ్చింది. మరి ఈ విషయంపై చిరంజీవి ఏమంటారో అనేది ఆసక్తికరంగా మారింది.