సినిమా వార్తలు

ఆర్మీ కల్నల్ పాత్రలో అదరగొట్టనున్న వెంకటేశ్!


11 months ago ఆర్మీ కల్నల్ పాత్రలో అదరగొట్టనున్న వెంకటేశ్!

ప్రస్తుతం హీరో వెంకటేశ్ .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' అనే మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ సినిమా తరువాత వెంకటేశ్ మరో మల్టీస్టారర్ చేయనున్నారు. ఈ సినిమాలో ఒక హీరోగా దుల్కర్ సల్మాన్ నటించనుండగా .. మరో హీరోగా వెంకటేశ్ కనిపించనున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ పాత్ర ఏమై వుంటుందనే ఆసక్తి అభిమానులందరిలో నెలకొంది . ఆయన ఈ సినిమాలో ఆర్మీ కల్నల్ గా కనిపించనున్నారనేది తాజా సమాచారం. యుద్ధం నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని తెలుస్తోంది. ఆర్మీ కల్నల్ గా వెంకటేశ్ పాత్రకి చాలా ప్రాధాన్యత వుంటుందని సమాచారం. అందువల్లనే ఆయన ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది.